రిలేషన్ షిప్ లో ఉన్నానని ఒప్పేసుకున్న విజయ్ దేవరకొండ.. చెప్తుంది రష్మిక గురించేనా?

రౌడీ విజయ్ దేవరకొండ “సాహిబా” అనే ఒక యూట్యూబ్ మ్యూజికల్ వీడియోలో కనిపించారు. తాజాగా విడుదలైన ఈ పాట కోట్లకు పైగా వ్యూస్ ని సంపాదించి వైరల్ సాంగ్ గా మారింది. ఈ పాటనీ ప్రమోట్ చేయడానికి వెళ్ళిన ఒక ఇంటర్వ్యూలో తన రిలేషన్షిప్ ప్రస్తావన వచ్చింది. మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా? అని ఇంటర్వ్యూ లో అడగగా, నాకు 35 ఏళ్లు వచ్చాయి ఇంకా రిలేషన్ షిప్ లో లేనంటే మీరు ఎలా నమ్ముతారు, నేను రిలేషన్షిప్ లో ఉన్నాను అని అన్నారు విజయ్ దేవరకొండ.

ఒకరిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అన్ కండిషనర్ లవ్ అంటే ఎలా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని నవ్వుతూ అన్నారు. అయితే తను చెప్తుంది నటి రష్మిక మందన్న గురించే అని ప్రేక్షకులు కన్ఫామ్ చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలు నుంచి విజయ్ రష్మికల మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు మీడియా ముందు ఈ ప్రశ్నను అడిగినా ఇద్దరూ కన్ఫామ్ చేయలేదు.

మొదటిసారి విజయ్ రిలేషన్షిప్ ని కన్ఫామ్ చేస్తున్నారంటే పెళ్లి వార్తలేమైనా వినిపించే అవకాశాలు ఉన్నాయేమో అని ప్రేక్షకులు ఆలోచనలలో పడ్డారు. ఏ పండగ అయినా, ఏ హాలిడే ట్రిప్ అయినా సరే ఇద్దరూ ఒకే దగ్గర ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలలో పెడుతున్నారు. అవి వైరల్ అవుతూ కచ్చితంగా ఇద్దరు రిలేషన్ షిప్ లోనే ఉన్నారు అని అభిమానులకు ఎప్పటికప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు.

“గీతాగోవిందం” సినిమాతో మొదలై ఇన్నాళ్లుగా సాగుతున్న వీళ్ళ ప్రేమ కథను మరి అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారు అని అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ తన తదుపరి సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు రష్మిక తన తాజా చిత్రం పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుండగా ప్రమోషన్లలో బిజీగా ఉంది. వీళ్ళిద్దరూ కలిపి ఫ్యూచర్లో మళ్లీ ఏమైనా సినిమా చేస్తే బాగుండు అని అభిమానులు ఎంతగానో ఆశ పడుతున్నారు మరి అది ఎప్పుడు నెరవేరుతుందో!