నేనీ స్థాయికి రావడానికి కారణం అదే.. సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన రష్మిక?

సినిమా ఇండస్ట్రీ లోకి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు నటి రష్మిక. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా కడుపుతున్నారు.ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏంటి అని ప్రతి ఒక్కరు ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే తాను ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏంటో తన సక్సెస్ సీక్రెట్ ఏంటో రష్మిక బయటపెట్టారు.

ఈ సందర్భంగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కన్నడ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనప్పుడు ఓ సినిమా అవకాశం అందుకున్నాను ఆ సినిమా సెట్స్ పై ఉండగానే తనకు గీత గోవిందం సినిమా అవకాశం వచ్చిందని ఈమె తెలిపారు.ఇలా తనకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని అయితే వాటిని ఎంతో చాలెంజ్ గా తీసుకొని ఎంతో కష్టపడుతూ తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు.

నా ఈ స్టార్ డమ్ వెనుక కేవలం అదృష్టం మాత్రం లేదనే విషయాన్ని తాను చాలా గట్టిగా నమ్ముతానని ఈమె తెలిపారు. ఇకపోతే తనకు ఇచ్చిన పాత్ర తెరపై కనిపించే తీరు దర్శక నిర్మాతలకు నచ్చడం వల్లే తనకు అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా రష్మిక తన సక్సెస్ సీక్రెట్ బయటపెట్టారు.ఏది ఏమైనా అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎంతో బిజీగా గడుపుతున్నారు.