Jr.NTR: ఊపిరి సినిమాలు ఎన్టీఆర్ నటించక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

Jr.NTR: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2016వ సంవత్సరంలో నాగార్జున, తమన్నా, కార్తీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఊపిరి. ఈ సినిమాని తెలుగు తమిళ భాషలలో నిర్మించి విడుదల చేశారు. రెండు భాషలలో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున కేవలం వీల్ చైర్ కు మాత్రమే పరిమితం కాగా అతనికి సహాయకుడిగా కార్తీ కనిపిస్తారు. అయితే ఊపిరి సినిమాలో హీరో కార్తి బదులు ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.అయితే ఉన్నఫలంగా ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయం తాజాగా బయటపడింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన RRRఈ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఊపిరి సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. ఇకపై తెలుగులో ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు వస్తాయని, అద్భుతమైన కథతో ఆ కథను హ్యాండిల్ చేయగల దర్శకులు తన వద్దకు వస్తే తప్పకుండా మల్టీస్టారర్ సినిమా చేస్తానని ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఊపిరి సినిమా గురించి కూడా ప్రస్తావన వచ్చింది.

ఆర్.ఆర్.ఆర్ లా బిగ్ బడ్జెట్ లేదా బిగ్ స్పాన్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తారా? ఎందుకంటే గతంలో మీరు ‘ఊపిరి’ ని చేయలేదు కదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ బిగ్ బడ్జెట్ లేదా స్పాన్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తాను అని చెప్పడం లేదు.ఒక దర్శకుడిగా మంచి కథతో తన దగ్గరకు వచ్చి ఆ కథను ఆ దర్శకుడు హ్యాండిల్ చేయగలననే నమ్మకం తనకు కలిగితే తప్పకుండా చేస్తానని ఎన్టీఆర్ చెప్పారు. ఇలా ఎన్టీఆర్ చెప్పిన మాటలను బట్టి చూస్తే ఊపిరి సినిమా వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయలేడనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో నటించడం లేదా అనే ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు.