కళ్ళు చిదంబరం ఆపరేషన్ చేయించుకోవడానికి కారణం ఏంటో తెలుసా?

అలనాటి హాస్యనటుడు కళ్ళు చితంబరం గారి అసలు పేరు కొల్లూరి చిదంబర రావు. ఈయన స్వస్థలం విశాఖపట్నం. కళ్ళు చిదంబరం పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూనే నాటకాల మీద మక్కువతో నాటకాలు వేయిస్తూనే తన వృత్తి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఉన్నతాధికారుల దగ్గర మంచి సంపాదించుకోవడంతోపాటు సినిమా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.

కొల్లూరి చిదంబర రావు 1987 సంవత్సరంలో రఘు గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కళ్ల సినిమాతో సినిమా ప్రపంచానికి పరిచయమై అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. తనకు గుర్తింపునిచ్చిన సినిమా రంగం మీద అభిమానంతో తన మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకొని కళ్ళు చిదంబరంగా ప్రసిద్ధి పొందారు. కళ్ళు చిదంబరం గారు తన మొదటి సినిమాకి ఎన్టీ రామారావు చేతుల మీదుగా నంది అవార్డును అందుకోవడం విశేషం.

అందరూ అనుకున్నట్లు కళ్ళు చిదంబరం గారికి చిన్నప్పటి నుంచి మెల్ల కన్ను లోపం లేదు.పన్నెండు సంవత్సరాల పాటు నిద్రాహారాలు లేకుండా నాటకాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూండటంతో అధికంగా ఒత్తిడి ఏర్పడి ఒక నరం పక్కకు వెళ్లి, మెల్ల కన్ను ఏర్పడింది. ఆ లోపమే చిదంబరం గారిని సినీ రంగానికి పరిచయమయ్యేలా చేసింది. అందుకే చిదంబరం గారు మెల్లకన్ను లోపాన్ని సరి చేసుకోవడం ఇష్టం లేక అలాగే వదిలేశారు.

కళ్ళు చిదంబరం గారు కళ్ళు ,అమ్మోరు, చంటి, గోల్మాల్ గోవిందా, పవిత్ర బంధం, ఆ ఒక్కటి అడక్కు వంటి దాదాపు 300 చలనచిత్రాలు తన హాస్యాన్ని పండించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారు. కళ్ళు చిదంబరం 2015 అక్టోబరు 19న తన 70 ఏళ్ల వయసులో విశాఖపట్నంలోని తన నివాసంలో మృతి చెందారు.