Pawan Kalyan: ఏ హీరోకి లేని రికార్డు సొంతం చేసుకున్న పవన్.. మామూలు టాలెంట్ కాదుగా?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన హీరోగా ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు కానీ తన నటనతో ఈయన తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాలు అంటేనే ఆసక్తి లేని పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖ బలవంతం మీద సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని పలు సందర్భాలలో తెలియచేశారు.

ఇలా తన వదిన బలవంతంతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇలా ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా ఉన్నత పదవులను అధిరోహించారు. అయితే నటనపరంగా పవన్ కళ్యాణ్ సాధించిన రికార్డులను ఏ హీరో కూడా ఇండియాలోనే సాధించలేదని చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చి ఎంత సంపాదించారు? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసారు? అనే విషయాలు ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. మనం ఇప్పుడు అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

చిరంజీవి వైఫ్ సురేఖ సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ అంటే తెలియని తెలుగు అభిమానులకు మార్షల్ ఆర్ట్స్ పరిచయం చేసి ఒక కొత్త కోణంలో హీరోగా తెరంగేట్రం చేశారు. హీరోగానే కాకుండా ఇండియాలోనే ఏ స్టార్ చేయని విధంగా స్టంట్ కొరియోగ్రాఫర్ గా,డాన్స్ మాస్టర్ గా, సింగర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా చేసి ఒక రికార్డు క్రియేట్ చేసుకున్నారు. అలా అన్ని కోణాలు కలగలిపి ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఆయన ఆస్తుల విషయానికి వస్తే దాదాపుగా 150 కోట్లకు పైనే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో 100 కోట్ల విలువగల ప్రాపర్టీస్, కార్లు,విల్లాలు ఇతరాత్ర వాటితో కలిసి 50 నుంచి 100 కోట్లు ఉంటుందట. ఇక ఈయన ఒక్కో సినిమాకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది ఒకరోజు షూటింగ్ లొకేషన్లో పాల్గొంటే సుమారు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో తెలిపారు.