అక్కినేని.. తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్…. మండిపడుతున్న అక్కినేని ఫ్యాన్స్!

టాలివుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. బాలకృష్ణ హీరోగా ఎంత పాపులర్ అయ్యాడో ఆయన కోపం వల్ల కూడా అంతే పాపులర్ అయ్యాడు. స్వతహాగా కోపిష్టి అయిన బాలకృష్ణ తరచూ తన అభిమానులపై చేయి చేసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా అభిమానుల పట్ల అప్పుడప్పుడు కోప్పడిన సంఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. బాలకృష్ణ ఇలా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో బాలకృష్ణ అంటే అభిమానులకే కాకుండా తోటి సెలబ్రిటీలకు కూడా కొంతవరకు భయం ఉంటుంది. ఇదిలా ఉండగా కొన్ని సందర్భాలలో బాలకృష్ణ చేసే వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ పురాణాల గురించి చెబుతూ ఒక వంశానికి చెందిన చరిత్ర గురించి తక్కువ చేసి మాట్లాడాడు. దీంతో ఆ వంశానికి చెందిన వారు బాలకృష్ణ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తమ వంశాన్ని కించపరిచేలా బాలకృష్ణ వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. అంతేకాకుండా తమ వంశస్తులకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో బాలకృష్ణ ఈ విషయంపై స్పందించి వారికి క్షమాపణలు కూడా తెలియజేశాడు. ఇక ఇటీవల
వీరసింహారెడ్డి సినిమా ద్వారా బాలకృష్ణ తాజాగా ఆ సినిమా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. చిత్ర యూనిట్ అంతా కలిసి ఈ సక్సెస్ మీట్ లో చాలా ఎంజాయ్ చేశారు.

ఇక ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ అక్కినేని కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో అక్కినేని అభిమానులు బాలకృష్ణ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా “వీరసింహుని విజయోత్సవం’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ… వేదికపై ఉన్న జయరాం అనే ఆర్టిస్ట్‌ గురించి చెబుతూ, ”ఇక ఈయన ఉన్నారంటే సెట్‌లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకుంటుండే వాళ్లం” అంటూ నోరు జారారు. అయితే అక్కినేని తొక్కినేని అని అనటంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బాలకృష్ణ ఇలా మాట్లాడటంతో అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.