కొడుకుల భవిషత్తు కోసం తనకి ఇష్టం లేని పని చేస్తున్న నాగార్జున ..?

టాలివుడ్ ఇండస్ట్రీ లో అక్కినేని కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వర రావు హీరోగా గుర్తింపు పొంది సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగర్జున కూడా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరో గా గుర్తింపు పొందాడు. ఇలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొంది తన తండ్రి వారసత్వాన్ని నాగార్జున కొనసాగించినప్పటికీ నాగార్జున వారసులు మాత్రం ఆ వారసత్వాన్ని నిలబెట్టలేకపోతున్నారు. నాగార్జున వారసులైన అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ ఇద్దరు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

అయితే వీరిద్దరూ కూడా ఇప్పటివరకు సరైన విజయం అందుకోలేదు. ఇక నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. వీరితో పాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఇతర హీరోలు ఇండియా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. అయితే అక్కినేని వారసులు ఇద్దరు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగలేకపోతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి వీరిద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రతిసారే నిరాశ మిగులుతోంది. దీంతో కొడుకుల భవిష్యత్తు కోసం నాగార్జున తన జీవితంలో ఎన్నడు చేయని పనిని చేయటానికి సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ భవిష్యత్తు కోసం నాగార్జున పూజలు హోమాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పూజలు వ్రతాలు హోమాల పట్ల ఆసక్తి లేని నాగార్జున ఎప్పుడు వాటికి దూరంగా ఉంటారని, కేవలం తన కొడుకుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పండితుల సూచన మేరకు ఇంట్లో పూజలు, వ్రతాలు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే కొడుకుల కోసం నాగార్జున ఇలా ఒక మెట్టు దిగి పూజలు హోమాలు చేయిస్తున్న వార్త తెలియటంతో ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏది ఏమైనా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.