శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్నటువంటి వారిలో నటుడు శర్వానంద్ ఒకరు.ఈయన కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అనంతరం హీరోగా హిట్టు ఫ్లాపాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ముందుకు కొనసాగుతున్నారు.ఇకపోతే ఈయనకు పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో శర్వానంద్ ఎక్కడికి వెళ్లినా ఈయన పెళ్లి గురించి ప్రస్తావనకు వచ్చేది. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ ఈయన త్వరలోనే సమాధానం చెప్పబోతున్నారు.

శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి ఈమె అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీరిది ప్రేమ పెళ్లి అని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి కానీ వీరిది పెద్దలు నిశ్చయించిన వివాహం. రక్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె.

మధుసూదన్ రెడ్డి తమ్ముడు గంగారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి అల్లుడు కావడంతో రక్షిత రెడ్డి కూడా టిడిపి అధినేత గోపాలకృష్ణారెడ్డి మనవరాలు అని తెలుస్తుంది.పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారు ఇక వీరి వివాహం జనవరి 26వ తేదీ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగనుంది. వీరి వివాహం వేసవి సెలవులలో జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా శర్వానంద్ భారీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని పొలిటికల్ ఫ్యామిలీకి అల్లుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Also Read

మనసు చచ్చిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక..?

ఛత్రపతి రీమేక్.. ఇలా అయ్యిందేంటి?