తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా దర్శకుడిగా జంధ్యాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన జంధ్యాల అనంతరం నాలుగు స్తంభాలాట సినిమాతో దర్శకుడిగా ఒక మెట్టు పైకి ఎక్కారు. ఇలా ఈ సినిమా తర్వాత జంధ్యాల వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో దూసుకుపోయారు. ఇక ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ముద్దమందారం సినిమా హీరోయిన్ కోసంఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తే ఆ అమ్మాయి నిర్మొహమాటంగా నేను చెయ్యనని తెగేసి చెప్పారట.
ఈ విషయాన్ని జంధ్యాల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ముద్దమందారం సినిమా సమయంలో జరిగిన ఈ సంఘటనను బయటపెట్టారు. ముద్దమందారం సినిమా కోసం ఎంతో మంది హీరోయిన్లను సంప్రదించిన జంధ్యాలకు నచ్చలేదు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఎన్నో ఊర్లు తిరిగిన ఆయన ఒక ఊరిలో ఒక అమ్మాయిని చూడగానే ఈమె నా ముద్దమందారం అని ఫిక్స్ అయ్యారట.ఇక ఆ ఊరి పెద్దల సహాయంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులను కలుసుకున్న జంధ్యాల తన సినిమాలో తన కూతురిని హీరోయిన్ గా పంపించమని ఆ తల్లిదండ్రులను ఎంతగానో బ్రతిమాలామని జంధ్యాల తెలిపారు.
మా ఊరి పెద్ద మనుషులు అందరూ కలిపి తన తల్లిదండ్రులను సినిమా కోసం ఒప్పిస్తున్న సమయంలో ఆ అమ్మాయి మధ్యలో వచ్చి సార్ నేనే ఏలాంటి సినిమాలలో నువ్వు నటించను నాకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పేసిందట.అది కాదమ్మా సినిమాలలోకి వస్తే ఏమి కాదు మీ అమ్మ నాన్నలు కూడా ఒప్పుకున్నారని జంధ్యాల చెప్పినప్పటికీ, నేను పెళ్లి చేసుకొని సంసారం చేయడం మీకు ఇష్టం లేదా సార్ అని అడగటంతో ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చి పరవాలేదు అమ్మా అని చెప్పి చివరికి పూర్ణిమను ముద్దమందారంలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు జంధ్యాల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.