వామ్మో ఈ మోడల్ తన శరీరంలోని ఈ భాగం కోసం 13 కోట్ల ఇన్సూరెన్స్ చేయించింది తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా వాహనాలను కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా వాహనాలకు బీమా చేస్తాము. ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఆ డబ్బులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం కూడా మన పేరు పై ఎన్నో రకాల బీమా పథకాలను చేస్తుంటాము. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మనకి ఆ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది.అయితే తాజాగా ఒక మోడల్ మాత్రం ఏకంగా తన శరీరంలోని ఒక భాగానికి 13 కోట్ల రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించిన ఘటన చోటుచేసుకుంది.

Model | Telugu Rajyamబ్రెజిల్ కి చెందిన మోడ‌ల్ నాథీ కిహారాకు తన శరీరంలోని పిరుదుల ఏకంగా 13 కోట్లు పెట్టి ఇన్సూరెన్స్ చేయించారు. ఈ మోడల్ మిస్ బుమ్‌బుమ్ 2021 వ‌ర‌ల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే తన శరీరంలోని
పిరుదుల వల్ల తన అందం రెట్టింపు అయిందని ఆ పిరుదులు కారణంగానే నాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయని ఈ మోడల్ తెలిపారు. అందుకోసమే వాటిపై ఇలా ఇన్సూరెన్స్ చేసినట్లు తెలిపారు. అయితే ఇవి సహజ సిద్ధమైనవని ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని
తెలియజేశారు.

వివాహం తర్వాత తాను ఏ విధమైనటువంటి వర్కౌట్స్ చేయలేదని కేవలం ఎంతో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటూ నా శరీరాన్ని కాపాడుకుంటున్నానని ఈ సందర్భంగా మోడల్ నాథీ కిహారా వెల్లడించారు. ఏదిఏమైనా ఈ మోడల్ తన పిరుదులు కోసం ఇంత పెద్ద మొత్తంలో బీమా చేయించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles