కృష్ణ సింహాసనం సినిమాకు 144 సెక్షన్ విధించారని మీకు తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరనే వార్త అభిమానులలోను సినీ సెలబ్రిటీలలోను ఎంతో ఆందోళనకు గురిచేస్తుంది. ఇలా సూపర్ స్టార్ కృష్ణ నేడు తుది శ్వాస విడవడంతో సినీ లోకం మొత్తం ఆయన నివాసానికి కదిలింది. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు కృష్ణ నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ విధంగా కృష్ణ నటించిన సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా సింహాసనం సినిమా గురించి చెప్పుకోవాలి. ప్రస్తుత జనరేషన్ లో సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో గత కొన్ని సంవత్సరాల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.

ఈ విధంగా అప్పట్లోనే ఫాన్ ఇండియా స్థాయిలో విడుదలైనటువంటి సింహాసనం సినిమా బాహుబలి సినిమా స్థాయిలో అప్పట్లో కలెక్షన్లను రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరియర్లో ఒక మైలురాయి అని చెప్పాలి.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఏకంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు అంటే ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉండేదో అర్థమవుతుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత టికెట్ల కోసం ప్రేక్షకులు 12 కిలోమీటర్ల క్యూ నిలబడ్డారంటే ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం అవుతుంది.

ఇక రాజ్ థియేటర్ ఎదుట ఈ సినిమా కోసం అభిమానులు క్యూ కట్టడంతో వీధి మొత్తం కిరిసిపోయేది ఈ క్రమంలోని పోలీసులు ఆ వీధి మొత్తం 144 సెక్షన్ విధించారు.కేవలం సినిమా టికెట్లు చూపించిన వారిని మాత్రమే ఆ వీధిలో తిరగనిచ్చేవారు. అలా సింహాసనం సినిమా విడుదలైన సమయంలో 144 సెక్షన్ విధించడం గమనార్హం ఇలా ఏ హీరో సినిమాల విషయంలో జరగలేదని చెప్పాలి.ఇక ఈ సినిమా కేవలం 56 రోజులు షూటింగ్ పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు వివిధ భాషలలో విడుదలైంది. ఈ సినిమాని ఏకంగా మూడు కోట్ల 50 లక్షలు బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో ఎప్పటికీ ఓ మైలురాయిగా నిలిచిపోయింది.