రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్స్ కి ఎంపికైతుందని ఎంతో ఆనందపడ్డారు. కానీ ఈ సినిమా ఆస్కార్ కి ఎంపిక కాకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఎంపిక కాకపోవటంపై హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించాడు. ఇటీవల ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సినిమా ఆస్కార్ కు ఎంపిక కాకపోవడంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో నిఖిల్ మాట్లాడుతూ…’ అందరూ నన్ను క్షమించాలి. ఆస్కార్ అవార్డు మీద నాకు వేరే అభిప్రాయం ఉంది. నిజానికి ఒక సినిమాకు అసలైన ఆస్కార్ అవార్డు అంటే ప్రేక్షకుల నుండి వచ్చే ప్రేమ, స్పందన అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ కు ఎంపిక కాకపోయినా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఎంతగానో ఆదరించారు. అదే ఈ సినిమాకు పెద్ద విజయం. ఎవరికి జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఉండగా ఆస్కార్ అవసరం ఏమిటి ? అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా మన సొంత అవార్డులో ఉండగా ఆస్కార్ అవార్డుతో అవసరమేముంది? అంటూ వెల్లడించాడు.
అయినా మనకు అస్కార్ నుంచి వచ్చే సర్టిఫికేట్ ఎందుకు? మన సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం భారతీయ సినిమాలు విడుదలైన అన్నిచోట్ల దూసుకుపోతున్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం అందుకుంది. స్పయిన్ లో నేను ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు స్పానిష్ ప్రజలతో థియేటర్లు నిండిపోయాయి. అక్కడి ప్రజలు మళ్లీమళ్లీ ఈ సినిమా చూడటానికి థియేటర్లకు వస్తున్నారు. ప్రపంచం నలవైపుల నుండి ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి ఇంతటి గొప్ప స్థాయిలో ఆదరణ ఉండగా ఇక మనకు ఆస్కార్ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.