హీరోగా మారుతున్న దర్శకుడు.!

ఓ మిడిల్ ఏజ్‌డ్ డైరెక్టర్ హీరోగా మారబోతున్నాడట. ‘మీరే హీరోగా ట్రై చేయొచ్చుగా..’ అని పలు సందర్భాల్లో పలువురు సినీ ప్రముఖుల నుంచి, సినీ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయట ఆ డైరెక్టర్‌కి. అయితే, అప్పట్లో లైట్ తీసుకున్నాడట ఆ డైరెక్టర్.

కానీ రోజులు మారాయ్.. ఒకప్పుడు హీరోల్లో వున్న కమిట్మెంట్ నేటి హీరోల్లో అరుదుగా కనిపిస్తోంది. కొందరు హీరోలతో సినిమా అంటే, పెద్ద తలనొప్పి యవ్వారంలా మారిపోయింది డైరెక్టర్లకి.

దాంతో, హీరోలతో ఆ తలనొప్పి భరించలేక, ఆ డైరెక్టర్ తానే హీరోగా అవతారమెత్తాలనుకుంటున్నాడట. డైరెక్షనే కాదు, ఈ డైరెక్టర్‌కి సొంత బ్యానర్ కూడా వుంది. దాంతో రిస్క్ చేసేద్దామా అనే ఆలోచనలో వున్నాడట.

మరి మిడిల్ ఏజ్డ్ డైరెక్టర్ అంటున్నారు కదా.. రొమాన్స్ గట్రా కమర్షియల్ అంశాల సంగతేంటీ.? అంటారా.? అవన్నీ కాదు కానీ, ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. ‘ ఇప్పటికీ ఇంకా.. వేరే నటుడితో ట్రై చేద్దాంలే అని ఆలోచనలో లోలోపల వున్నా, మనమే నటించేస్తే పోలా.. అనే ఆలోచన డామినేట్ చేస్తుండడంతో అటు వైపుగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడట ఆ మిడిల్ ఏజ్డ్ డైరెక్టర్. ఎవరా డైరెక్టర్.? ఏంటా కథ.? తెలియాల్సి వుంది.