తేజ అలా చెప్పుకుని బతికేస్తున్నాడంతే.!

ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్ అయితే, బొత్తగా సంస్కారమే లేని డైరెక్టర్ తేజ. ఎంత మంది కొత్త డైరెక్టర్లు వచ్చినా, సినీ రంగంలో ఎన్ని కీలకమైన మార్పులొచ్చినా ఆయన మాత్రం ఇంకా మారలేదు.

ఒకే సినిమాని పదే పదే తీశాడు. ఇంకా అదే పైత్యాన్ని ఈ కాలంలోనూ రుద్దాలని చూస్తున్నాడు. ‘అహింస’ అనే సినిమాతో తేజ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరే, ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఆయన చేస్తున్న చీఫ్ బిహేవియర్ ఏదైతే వుందో దాన్ని మాత్రం విమర్శించకుండా వుండలేకపోతున్నాం. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం తనకు తెలుసంటాడు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తన వద్దకు వచ్చాడట ఉదయ్ కిరణ్. చాలా డిప్రెషన్‌కి గురయ్యానని చెప్పాడట.

తప్పయిపోయిందని కాళ్లు పట్టుకున్నాడట. అయితే, తాను మాత్రం ఉదయ్ కిరణ్‌ని క్షమించనని చెప్పేశాడట. చనిపోయిన వ్యక్తి గురించి ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా.? అదీ తేజ అంటే.! ‘అహింస’ ప్రమోషన్లలో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఇటు విలేఖర్లపై అవాకులు చవాకులు పేలుతూ, తనదైన పైత్యాన్ని చూపిస్తున్నాడు తేజ.