Director Teja: మహేష్ బాబు కంటే నటనలో ఆ హీరో తోపు… తేజ సంచలన వ్యాఖ్యలు!

Director Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో తేజ ఒకరు. చిత్రం సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈయన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తేజ దర్శకత్వంలో ఎంతోమంది కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా సూపర్ హిట్ సినిమాలను అందించిన ఘనత తేజకు ఉందని చెప్పాలి. ఇక తేజ వ్యవహార శైలి విషయానికి వస్తే ఏ విషయమైనా నిర్భయంగా నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తన సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ముఖ్యంగా మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో నిజం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో మహేష్ బాబు తన నటనతో అదరగొట్టారని చెప్పాలి. మహేష్ బాబుకు ఈ సినిమాలో నటించినందుకు నంది అవార్డు కూడా లభించింది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు నటన కంటే కూడా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా నటన అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు.డైలాగ్ డెలివరీని ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయడంలో అతను చాలా వరకు సక్సెస్ అయ్యాడంటూ రానా గురించి తేజ చేస్తున్న ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో నటన పరంగా మహేష్ బాబు కంటే రానా బెస్ట్ అంటూ తేజ చెప్పకనే చెప్పేసారని రానా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.