తరుణ్ భాస్కర్‌కి ‘పెళ్లిచూపులు’ ఇచ్చిన గుర్తింపు చాలా పెద్దది. కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. అలాగే తన స్థాయిని మించి ఎదిగిన విజయ్ దేవరకొండను మరోసారి తన సినిమాకు ఒప్పించడం మాత్రం ఇప్పటిదాకా సాధ్యపడలేదు. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో తరుణ్ తనదైన మార్గంలో ప్రయోగాలు చేస్తూ పోయాడు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ కాలేదు.
ఇప్పటికీ విజయ్ దేవరకొండ టాప్ హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12, రాహుల్ సంకృత్యన్‌తో VD14, ఆపై మరో పీరియడ్ సినిమా.. ఇలా షెడ్యూల్ పూర్తిగా బిజీగా ఉంది. దీనికితోడు కల్కి 2898 AD సీక్వెల్‌లో కూడా అతడు అర్జునుడిగా కనిపించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తరుణ్ భాస్కర్ తిరిగి విజయ్‌తో ఒక సాలిడ్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట.
ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నా.. కథతోనే ఆకట్టుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌తో వెళ్లగలిగితే మాత్రం విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ రిపీట్ కావాలని ఎదురుచూస్తున్నారు. ‘పెళ్లిచూపులు’ సక్సెస్‌లా కాకుండా, ఈసారి ఇంకొంత కమర్షియల్ టచ్‌తో సినిమా వస్తే, అది మార్కెట్ పరంగానూ భారీగా వర్కౌట్ అవుతుందన్న నమ్మకం ఉంది. మరి.. రౌడీ మరోసారి తన మొదటి దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.