మీడియా గాలి తీసేసిన డైరెక్టర్ శంకర్ !

శంకర్ .. ఇండియన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు. పదేళ్ళ తర్వాత సమాజంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయే అదే చూపించి దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. జెంటిల్ మాన్ సినిమాతో దర్శకుడిగా మారిన శంకర్ తన ప్రతి సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతూ వచ్చాడు. హాలీవుడ్ దర్శకుడిగా సినిమాలని తీస్తాడని నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో పేరు సంపాదించుకున్నాడు. భారతీయుడు.. ఒకే ఒక్కడు.. అపరచితుడు..రోబో.. రోబో 2 లాంటి సెన్షేషనల్ హిట్ సినిమాలని తీసి కోలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా టాప్ ప్లేస్ లో నిలిచాడు.

ఇలాంటి పాపులర్ దర్శకుడు ఇప్పుడు మీడియా మీద చురకలు వేస్తూ షాకులిస్తున్నాడు. రోబో తమిళంలో ఎంథీరన్ గా తెరకెక్కిన సినిమాకి సంబంధించిన దశాబ్దాల కేసులో స్టార్ డైరెక్టర్ శంకర్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ కోలీవుడ్ మీడియాతో పాటు పలు మీడియాల్లోనూ కథనాలు వచ్చి ఈ మధ్యకాలంలో బాగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఆయన న్యాయవాది విఫలమయ్యారని దీంతో బెయిల్ ఇవ్వని వారెంట్ జారీ అయ్యిందని వచ్చిన వార్తలు హాట టాపిక్ గా మారాయి.

అయితే తాజాగా దర్శకుడు శంకర్ తాజాగా పత్రికా ముఖంగా ప్రకటన జారీ చేశారు. గౌరవనీయ ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందనే తప్పుడు వార్తలను చూసి తాను షాక్ కి గురయ్యానంటూ స్పందించడం మరొక హాట్ టాపిక్ గా మారింది. శంకర్ తరపు న్యాయవాది మిస్టర్ సాయి కుమారన్ కోర్టును ఆశ్రయించారని.. ఈ వార్తలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారని వారెంట్ ఏదీ జారీ చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేయడాన్ని తప్పు పట్టడమే గాక శంకర్ మీడియా వారి మీద సెటైర్స్ వేశారు.