శంకర్ డైరెక్షన్‌లో ‘మెగా సూపర్’ త్రయం.!

శంకర్ డైరెక్షన్‌లో సినిమా అంటే, ఓ రేంజ్ వుండాల్సిందే. ఆ ప్రాజెక్ట్‌లో నటించే నటీ నటులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు.. ఆ రేంజే వేరు.అలాంటి శంకర్ ముగ్గురు సూపర్ స్టార్స్‌తో సినిమా తీస్తే ఎలా వుంటుంది.? ఖచ్చితంగా అది శంకర్ రేంజ్‌లోనే వుంటుంది. అందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ ముగ్గురు సీనియర్ సూపర్ స్టార్లు ఎవరా.? అంటే ఒకరు మెగాస్టార్ చిరంజీవి, ఇంకొకరు సూపర్ స్టార్ రజనీకాంత్, మరొకరు విశ్వనటుడు కమల్ హాసన్. ఈ కాంబినేషన్ ఊహించుకుంటేనే ఆ కిక్కు వేరే లెవల్‌లో వుంటుంది కదా. ఆల్రెడీ కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నాడు శంకర్. ఈ సినిమా పూర్తి కాగానే రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ పూర్తి చేయాలి.

ఆ తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడన్న గుసగుస వుంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం చిరంజీవి సినిమాలోనే రజనీకాంత్, కమల్ హాసన్ కూడా పార్ట్ కాబోతున్నారనీ, కేవలం గెస్ట్ రోల్స్‌లా కాకుండా, నిడివి ఎక్కువగా వున్న పాత్రల్లోనే నటించబోతున్నారనీ. అలా భారీ మల్టీ స్టారర్‌గా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోందనీ ఇన్‌సైడ్ టాక్.