ఆగస్ట్ 10న విడుదలైన రజనీకాంత్ ’జైలర్’ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. అంచనాలను మించి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తొలి రోజే మంచి వసూళ్లను కూడా అందుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్టాల్ర విషయానికొస్తే మంచి కలెక్షన్స్ దక్కాయి. రజనీ గత చిత్రాలతో పోలిస్తే ఈ ‘జైలర్’ చిత్రం తొలి రోజు భారీ స్థాయిలో షేర్ వసూళ్లను అందుకుంది. తెలుగు రాష్టాల్లో రజనీ చివరి చిత్రం ’పెద్దన్న’ రూ.1.60కోట్లు సాధించగా, ’దర్బార్’ రూ.4.52కోట్లు, ’పేట’ రూ.1.65కోట్లు వసూళ్లు మాత్రమే చేశాయి.
అయితే వీటికన్నా ముందు ‘రోబో 2.0’ మాత్రం అత్యధికంగా రూ.12.5కోట్లను అందుకోంది. ‘జైలర్’ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. నైజాంలో రూ. 3.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 94 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 81 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.01 కోట్లు షేర్, రూ. 12.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ప్రపంచ వ్యాప్తంగానూ మంచి వసూళ్లనే అందుకుందీ చిత్రం.
తెలుగులో రూ. 12.50 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 22.85 కోట్లు, కర్నాటక రూ. 11.80 కోట్లు, కేరళలో రూ. 5.85 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35.10 కోట్లు గ్రా కలెక్ట్ అయింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 91.20 కోట్ల గ్రాస్, రూ. 44.75 కోట్లు షేర్ వచ్చాయి. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 122.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఇకపై తెలుగు ఆడియెన్స్ ‘జైలర్’సినిమాకే మొగ్గు చూపే అవకాశముంటుంది. దీంతో ’జైలర్’కు మరిన్ని థియేటర్లు కూడా పెరుగుతాయి.