జైలర్.. ఇది కదా బౌన్స్ బ్యాక్ అంటే..

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చక్రం తిప్పిన సూపర్ స్టార్ రజినీకాంత్ సౌత్ ఇండస్ట్రీలో కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. అలాగే విదేశాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. అయితే రజినీకాంత్ రోబో సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో సక్సెస్ అయితే అందుకోలేకపోయాడు.

ఇక ఇన్నాళ్లకు మొత్తానికి జైలర్ సినిమాతో ఆ తరహాలో అయితే క్రేజ్ అందుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరి కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది అనిపిస్తుంది. జైలర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న తమిళ్ సినిమాల లిస్టులో కూడా జైలర్ టాప్ లిస్టులో చేరడం విశేషం.

రజనీకాంత్ ఏకంగా తన పాత రికార్డులను తనే బ్రేక్ చేసుకున్నాడు. 2.ఓ సినిమా 2018లో రాగా అది ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే 95 కోట్ల కలెక్షన్స్ లో సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు జైలర్ సినిమా 91 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని రెండవ స్థానంలో నిలిచింది. కబాలి సినిమా 87.5 కోట్లతో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక విజయ్ బీస్ట్ సినిమా 86.15 కోట్లతో 4వ స్థానంలో ఉంది. జైలర్ సినిమా 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని టాప్ కోలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో రెండవ స్థానంలో నిలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.