ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన డైరెక్టర్.. ఎన్ని కోట్లు తెలుసా?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులను సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఖరీదైన అపార్ట్మెంట్ లను, బంగ్లాలు కొనుగోలు చేస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఖరీదైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేయగా తాజాగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సైతం ఖరీదైన ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ వివేక్ ముంబైలోని అందేరిలోని వెర్సీవాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంటి దగ్గర్లోనే ఈయన కూడా 3258 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30వ అంతస్తులు ఉన్నటువంటి ఇంటిని ఏకంగా 17.92 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.ఇక ఈ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి అయినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫ్లాట్ పైభాగంలోనే అమితాబచ్చన్ కూడా తాజాగా ఒక ప్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.

వివేక అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఈయన ఎలాంటి విజయాన్ని అందుకున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమా విజయం తర్వాత ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలపై స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇదివరకు ఈయన సినిమా పరిశ్రమపై అలాగే బాలీవుడ్ నెపోటిజంపై చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చలకు దారితీసాయి.