మొత్తానికి “RC15” విషయంలో బతికే ఉన్నారు.!

Ram-Charan-Shankar-movie-1 (1)

టాలీవుడ్ లో ఉన్నటువంటి  టాప్ మోస్ట్ ప్రొడక్షన్స్ హౌస్ లలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సంస్థ కూడా ఒకటి. అయితే తన సినిమాని ప్రేక్షకుల్లో తీసుకెళ్లడానికి దర్శకుడు రాజమౌళి ఏ లెవెల్ ప్లాన్ లు చేస్తాడో అలాగే నిర్మాతల్లో దిల్ రాజు కూడా మంచి ప్లానింగ్ ప్రకారం తన సినిమాలు చేస్తాడు.

అయితే తన లేటెస్ట్ సినిమా వారిసు కోలీవుడ్ హీరో విజయ్ తో చేసిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే దీనికన్నా ముందే దీనికన్నా పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి శంకర్ మరియు రామ్ చరణ్ ల సినిమా కూడా ఒకటి. దీని  సినిమాని ఓ రేంజ్ లో ప్రమోషన్స్ అప్డేట్ లు స్పెషల్ వీడియోలు చేసి గట్టి హంగామా చేసారు.

ఇదే సమయంలో చరణ్ సినిమాని పక్కన పెట్టి అసలు ఏ చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా నాన్చుతూ వచ్చారు. దీనితో విజయ్ సినిమాకి ఒకలా మన సినిమాకి ఒకలా ప్లాన్ లు చేయడం బాగోలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనితో RC15 కి గాని వారిసు తరహాలో ప్లాన్ లు చేయకపోతే అప్పుడు తమ సత్తా చూపిస్తామని చరణ్ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేశారు.

దీనితో ఇప్పుడు ఈ సినిమాకి ఆ తరహాలో దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది. లేటెస్ట్ గా సినిమా హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి కాగా ఈమెకి గాను దర్శకుడు శంకర్ నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ అలాగే మొత్తం చిత్ర యూనిట్ కూడా కలిసి వారికి స్పెషల్ విషెస్ చెప్తూ వీడియో బైట్ రిలీజ్ చేశారు.

దీనితో ఈ రకమైన ప్రమోషన్స్ ని అయితే తాము కోరుకుంటున్నామని ఫైనల్ గా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇక నుంచి ఈ సినిమా విషయంలో మంచి అప్డేట్స్ వస్తాయని చెప్పొచ్చు.