ప్రభాస్ ని ఈ వింత లుక్ లో ఎప్పుడైనా చూసారా??

ఇండియన్ సినిమా దగ్గర ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోస్ లో పాన్ ఇండియా హీరో మన తెలుగు హీరో ప్రభాస్ కూడా ఒకడు. ఇప్పుడు తాను చేసిన చిత్రాల్లో సెన్సేషనల్ చిత్రం “సలార్” సినీ వర్గాల్లో భారీ హైప్ సెట్ చేసుకొని రిలీజ్ కి రాబోతుండగా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ పాత ప్రభాస్ ని సలార్ లో చూడొచ్చని కూడా అనుకుంటున్నారు.

కాగా రీసెంట్ గానే ప్రభాస్ ఇటలీలో తన మోకాలికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. మరి అక్కడ ప్రభాస్ తీసుకున్న ఓ పిక్ ఇపుడు వైరల్ గా మారింది. దీనితో చూసినట్టు ప్రభాస్ ని ఇంతవరకు ఎవరూ చూసి ఉండరు. ఎందుకంటే ప్రభాస్ ఇటలీలో ఫ్రెంచ్ బియర్డ్ ని డిజైన్ చేసుకున్నాడు. అంటే సైడ్ గడ్డం తీసేసి కేవలం మీసాలు కింద గడ్డం మాత్రమే ఉంచుకున్నాడు.

దీనితో ఈ లుక్ లో ప్రభాస్ ని చూసేందుకు కాస్త వింతగా కనిపిస్తున్నాడు అని చెప్పాలి. దీనితో ఈ అరుదైన లుక్ పిక్ జస్ట్ కొందరి వరకే రీచ్ అయ్యింది. ఇక ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే ఉండగా అతి త్వరలోనే సలార్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక వీటి తర్వాత ప్రభాస్ దర్శకుడు మారుతీ, నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఏడి” అనే చిత్రాలు చేస్తున్నాడు. 
https://x.com/_faith4u_/status/1724470420391481600?s=20