తప్పు చేశానేమో.! రేణు దేశాయ్ అంతర్మధనం.!

తెలుగు తెరపై బోల్డన్ని అవకాశాలు.! అక్క, అమ్మ తదితర పాత్రల్లో అలనాటి అందాల భామలు నటించడం మామూలే.! నదియా అనూహ్యంగా స్టార్‌డమ్ సంపాదించుకోవడం తెలిసిన సంగతే కదా.!

అలాంటి బ్రైట్ రోల్స్ ఎంచుకోకుండా, కష్టమైన రోల్ ఎందుకు రేణు దేశాయ్ ఎంచుకున్నట్టు.? ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలోని ఆమె పాత్ర అంతలా డిజాస్టర్ ఎందుకు అయినట్టు.?

ఆత్మ విమర్శ చేసుకున్నాక, ఇకపై ఇలాంటి పాత్రలు.. అంటే, డీ-గ్లామర్ రోల్స్ చేయకూడదనే నిర్ణయానికి రేణు దేశాయ్ వచ్చారన్నది తాజా ఖబర్. వాస్తవానికి, రేణు దేశాయ్‌కి అవకాశాలేమీ పోటెత్తలేదుగానీ, వచ్చిన అవకాశాన్ని ‘సరే’ అన్నారంతే. ఫలితం, ఫెయిల్యూర్.

దాంతో, ఇకపై ఇలాంటి రోల్స్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్న రేణు దేశాయ్, మళ్ళీ దర్శకత్వం అలాగే నిర్మాణంపై ఫోకస్ పెట్టారట. అయితే, ‘టైగర్ నాగేశ్వరరావు’ తనను నిరాశపర్చిందన్న విషయాన్ని ఆమె ఎక్కడా ప్రస్తావించడంలేదు. అదే ఆమె ప్రత్యేకత.

సినిమాలో తనది ఛాలెంజింగ్ రోల్ అని మాత్రమే ఆమె చెబుతున్నారు. అంత ఛాలెంజింగ్ ఏంటో ప్రేక్షకులకైతే అర్థం కావట్లేదు. వాస్తవానికి, ఆమె పాత్రని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా దర్శకుడు తీర్చిదిద్ది వుండాల్సింది.