లలిత జువెలర్స్ ఓనర్ కూడా నటుడేనని మీకు తెలుసా? ఏ సినిమాలో నటించారంటే?

సాధారణంగా ఏదైనా ఒక కంపెనీను ప్రమోట్ చేసుకోవాలంటే దేశ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీలను ప్రమోటర్ గా ఎంచుకొని వారిని తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటాము.ఇకపోతే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన లలిత జ్యువెలర్స్ కి మాత్రం ఎలాంటి సెలబ్రిటీలు ప్రమోటర్ గా వ్యవహరించలేదు. స్వయంగా ఈ కంపెనీ ఎండి కిరణ్ కుమార్ లలిత జ్యువెలర్స్ కు ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన లలిత జ్యువెలర్స్ లో కాకుండా ఇక్కడ ధరలతో వేరే చోట నగలను ధరలను కంపేర్ చేసి కొనండి డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ పెద్ద ఎత్తున తమ నగలపై నమ్మకాన్ని పెంచారు.

ఈ విధంగా కిరణ్ కుమార్ ఈ ఒక్క మాటతో తన జువెలరీ షాప్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడమే కాకుండా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో బ్రాంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఇకపోతే ఇలా లలిత జ్యువెలర్స్ కు ఎండిగా వ్యవహరిస్తున్నటువంటి ఈయన కూడా ఒక సినిమాలో నటించారని విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈయన ఏ సినిమాలో నటించారనే విషయానికి వస్తే…

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సోనాక్షి సిన్హా, అనుష్క శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం లింగ. ఈ సినిమాలో ఈయన జ్యువెలరీ యజమానిగా కనిపించారు. ఇలా ఈ సినిమాలో కెమెరా ముందు కనిపించడం ఈయనకు మొదటిసారి. ఈ సినిమా తర్వాత తను తన జువెలరీ షాప్ ప్రమోటర్ గా రెండవసారి కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఈయన మొదట్లో తన జ్యువెలరీ షాప్ యాడ్ కోసం మూడు రోజుల పాటు కష్టపడినట్లు తెలుస్తోంది. లలిత జ్యువెలర్స్ అంటేనే వెంటనే టక్కున గుండుతో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రూపం మన కళ్ళు ముందు కనపడుతుంది. అంతలా ఈయన ఫేమస్ అయ్యారని చెప్పాలి.