Anushka Sharma: చేతిలో సినిమాలు లేకపోయినా కోట్లు సంపాదిస్తున్న అనుష్క శర్మ.. ఎలా అంటే?

Anushka Sharma: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్రికెటర్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. ఆమె నటించిన చాలా మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఒకప్పుడు సినిమాలలో నటించిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ భర్త విరాట్ కోహ్లీతో, కూతురుతో కలిసి హ్యాపీగా లైఫ్‌ ని లీడ్‌ చేస్తోంది. విరాట్ కోహ్లీతో కలిసి విరుష్కగా మారిన ఈ జంట 2017 డిసెంబర్ 11న పెళ్లి చేసుకొని మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయిన విషయం తెలిసిందే.

ఈ దంపతులకు 2021లో వామిక అనే పాప జన్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క ఆదాయంపై ఇప్పుడు నెటిజెన్ల దృష్టిపడింది. అయితే అనుష్క, కోహ్లీ ఇద్దరూ పలు కమర్షియల్ యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే. వీటికి కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని పోస్టులు చేస్తూ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కాగా అనుష్క ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటోంది. అందుకే ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కూడా పేరు తెచ్చుకుంది.

అంతేకాకుండా ఈమె వ్యాపారవేత్త కూడా. నష్ అనే సొంత బట్టల దుకాణం ఉంది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ ద్వారా ఎన్‌హెచ్ 10, ఫిల్లౌరి, పరి వంటి హిట్ సినిమాలు నిర్మించింది. చాలా పెద్ద బ్రాండ్‌ లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహరిస్తోంది. అలా అనుష్క నెల సంపాదన కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. దీనితో పాటు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తోందట. హీరోయిన్‌ గా సినిమాలు లేకపోయినా నెలకు రెండు కోట్లకు పైగానే సంపాదిస్తుంది అనుష్క. విరాట్ కోహ్లీ కూడా క్రికెటర్ గా, పలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న విషయం తెలిసిందే.