బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయటం వల్ల మేకర్స్ కి అన్ని కోట్ల నష్టం వచ్చిందా..?

బాలీవుడ్ పరిశ్రమ నుండి విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర. యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్ , అలియా భట్ జంటగా నటించారు. విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాకి సౌత్ ఇండస్ట్రీలో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 2 వ తేదీన హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో భారీ స్థాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్యఅతిథిగా హాజరు అయ్యాడు. అయితే వినాయక నవరాత్రులు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయలేమని చివరి నిమిషంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేశారు. దీంతో మేకర్స్ వెంటనే పార్క్ హయత్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాజమౌళి, కరణ్ జోహార్, రణబీర్ కపూర్, ఆలియా భట్, ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆలియా భట్ తెలుగులో పాట పాడే అందరిని ఆశ్చర్యపరచగా రణబీర్ కపూర్ కూడా తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులో మాట్లాడాడు.

ఇక ఈ సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో గ్రాండ్గా నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. కానీ చివరి నిమిషంలో బందోబస్తు కల్పించలేక హైదరాబాద్ పోలీస్ అధికారులు ఈవెంట్ ని రద్దు చేశారు. అందువల్ల వెంటనే పార్క్ హయాత్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చిందని వెల్లడించాడు. అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని ఏర్పాటు చేసుకున్నామని ఇలా చివరి నిమిషంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయడం వల్ల ఈ సినిమా మేకర్స్ కి రూ. 2.25 వరకు నష్టం వచ్చిందని వెల్లడించాడు. అంతేకాకుండా మళ్లీ పార్క్ హయాత్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినందుకుగాను దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు వచ్చిందని ఈ సందర్భంగా రాజమౌళి వెల్లడించాడు.