అర్జున్ రెడ్డి .. తెలుగులో సంచలనం విజయం అందుకున్న సినిమా. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కి సాలీడ్ హిట్ దక్కింది. ఇందులో హీరోయిన్ గా నటించిన శాలినీ పాండే కి భారీ హిట్ దక్కింది. ప్రీతి గా నటించిన శాలినీ పాండే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఊహించని రేంజ్ లో వరసగా అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు.
శాలినీ పాండే కూడా స్టార్ హీరోయిన్ అయిపోతానని నమ్మకంగా ఉండింది. కాని అనుకున్నట్టుగా కెరీర్ లో క్రేజీ ఆఫర్ రాకపోవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమా కెరీర్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. చెప్పాలంటే అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో మహానటి సినిమా తో పాటు నందమూరి కళ్యాణ్ రాం తో 118, ఎన్.టి.ఆర్ కథానాయకుడు, యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అన్న సినిమాలు చేసింది.
కాని వీటిలో హీరోయిన్ గా చేసిన ఒక్క 118 తప్ప మిగతావి శాలినీ పాండే కెరీర్ కి ఉపయోగపడలేదు. కాగా అన్నో ఆశలు పెట్టుకున్న అనుష్క నిశ్శబ్ధం సినిమా కూడా శాలినీ పాండే ని హైలెట్ చేయలేకపోయింది. ప్రస్తుతం శాలినీ పాండే చేతిలో ఒక్క సినిమా కుడా లేకపోవడం షాకింగ్ విషయం. బోల్డ్ గా నటించడానికి వెనకాడని శాలినీ పాండే యంగ్ హీరోలకి మంచి ఛాయిస్. మరెందుకు ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదో.