Allu Bobby: అల్లు బాబీ ప్లేట్లు కడగారా… దాని వెనుక ఇంత స్టోరీ ఉందా.. ?

Allu Bobby: తాతలు సంపాదించిన ఆదాయం, ఇక తండ్రి గురించి చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో ఓ పేరున్న నిర్మాత. ఇక ఆ ఫ్యామిలీలో ఉన్న ఓ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. పేరుకి హీరోనే ఐనా దానికి మించిన సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రేకకులకే కాక సినీ హీరోలకు సైతం ఆయన ఆదర్శం. అలాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చి, అంత డబ్బు ఉండీ వాటి సహాయంతో కాకుండా తన స్వయం కృషితో పైకి రావాలని కోరుకున్న వ్యక్తి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ. చిన్న తనం నుంచీ సొంతంగా ఏదైనా సాధించాలనే పట్టుదలతో కష్ట పడుతూ, అతని స్థాయికి భరించాల్సిన అవసరం లేకున్నా, వాటికి ఓర్చి ఈ రోజు ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగు పెట్టాడు.

ఇకపోతే అప్పట్లో అల్లు బాబీ రెస్టారెంట్ లో ప్లేట్లు కడిగాడనే వార్త ప్రచారం కాగా, ఆ విషయంపై ఆయన దాని వెనక ఉన్న రహస్యాన్ని బయట పెట్టారు. 1994 లో తనకు 17 ఏళ్లు ఉండగా, ఆ టైంలో తాను ఆస్ట్రేలియా వెల్లానన్న బాబీ, అక్కడ చదువుకుంటూ, ఫ్రెండ్స్ తో జాలిగా గడిపేవాడినని ఆయన తెలిపారు. అయితే చదువుకోగా తమకు కాస్త సమయం మిగిలేదని, ఆ టైం లో ఏదో ఒక పని చేసేందుకు తన ఫ్రెండ్స్ పని కూడా చూసుకున్నారని ఆయన చెప్పారు. అప్పుడు తాను కూడా ప్రయత్నించగా ఒక రెస్టారెంట్ లో పని దొరికిందని బాబీ తెలిపారు. కానీ తాను వెయిటర్ జాబ్ కి వెళితే, వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్లేట్లు కడగడం నేర్చుకో అని చెప్పారని ఆయన అన్నారు. దాంతో ప్లేట్లు కూడా కడిగానని ఆయన చెప్పారు. అంతే కాదు అక్కడ పెట్రోల్ బంక్ లలో, కాల్ సెంటర్ లలో కూడా పని చేశానని ఆయన చెప్పారు.

అయితే తనకు ఇంత డబ్బున్నా, కావల్సినంత తన తండ్రి పంపిస్తున్నా, తనకు మాత్రం కష్టపడి సంపాదించాలనే కోరిక ఉండేదని ఆయన తెలిపారు. ఆ కోరిక నేపథ్యంలోనే తాను ఆ పనులన్నీ చేశానని ఆయన చెప్పారు. అందుకు తన కూడా చాలా సహకరించే వారని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే బాబీ ఇటీవల నిర్మించిన చిత్రం గని. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 8 న రిలీజ్ కానుంది.