బాక్సాఫీస్ : షాకింగ్ రన్ తో “ధమాకా”..11 రోజుల్లో మాసివ్ నంబర్స్.!

గత ఏడాదికి లాస్ట్ హిట్ అయినటువంటి చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం “ధమాకా” మాత్రమే అని చెప్పాలి. మరి ఈ చిత్రం అయితే గత ఏడాదిలో రిలీజ్ అయినప్పటికీ ఈ కొత్త సంవత్సరం కూడ భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది మరి ఈ సినిమా 10వ రోజు కూడా మాసివ్ వసూళ్లు నమోదు చేయగా ఇప్పుడు 11వ రోజు కూడా అదిరే వసూళ్లు రాబట్టినట్టు చిత్ర యూనిట్ చెప్పారు.

ఇక దీనితో అయితే ధమాకా చిత్రం మొత్తం ఈ 11 రోజుల్లో 94 కోట్ల భారీ గ్రాస్ ని అందుకుంది. దీనితో ఈ సినిమా ఇప్పుడు రవితేజ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం అయితే యూఎస్ లో కూడా 5 లక్షల 55 వేల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి తెలుగు స్టేట్స్ నుంచే 90 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ చిత్రం కొల్లగొట్టింది.

దీనితో సినిమాకి సగానికి పైగా లాభాలు వచ్చాయి. ఇంతే కాకుండా ఈరోజుతో అయితే 100 కోట్ల క్లబ్ లోకి కూడా ఈ సినిమా ఎంటర్ అయ్యి రవితేజ కెరీర్ లో మరో 100 కోట్ల గ్రాసర్ గా నిలవనుంది. దీనితో మాత్రం ధమాకా మాసివ్ నంబర్స్ తో దుమ్ము లేపుతుంది అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించగా లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల రవితేజ సరసన నటించింది.