దేవీ నాగవల్లిని ఇంతకు ముందు జనాలు ఓ రకమైన ఇమేజ్‌తో చూసేవారు. టీవీ9 ఎఫెక్ట్ వల్ల దేవీ నాగవల్లికి విపరీతమైన నెగెటివిటీ ఉండేది. ఆమె అతి చేస్తుంది అంటూ అందరూ ట్రోల్ చేసేవారు. ఆ నెగెటివిటే ఆమె కొంపను ముంచింది. మొదటగా దేవీ నాగవల్లి బిగ్ బాస్ షోలో ఎంట్రి ఇచ్చిన క్షణంలోనూ అందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. ఆమెను వెంటనే ఎలిమినేట్ చేసేయాలని అందరూ కంకణం కట్టుకున్నారు.
కానీ ఆమె ఆటతీరు, మాటతీరు, ప్రవర్తనా విధానం, నిజాయితీ, ముక్కుసూటిదనం ఇలా అన్ని లక్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలా దేవీ నాగవల్లి మీదున్న నెగెటివిటీ కొంచెం కొంచెం పోతూ వచ్చింది. కానీ మూడో వారంలోనే దేవీ నాగవల్లి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అందులోనూ ఓ వివాదం జరుగుతూనే వచ్చింది. ఆ సమయంలో మెహబూబ్‌ను కాపాడటం కోసమే దేవీ నాగవల్లిని బయటకు పంపించారని కామెంట్లు వినిపించాయి.
ఏది ఏమైనా గానీ దేవీ నాగవల్లికి మాత్రం మంచి ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం దేవీ నాగవల్లిని అందరూ గౌరవంగా చూస్తుంటారు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో విపరతీమైన ఫాలోయింగ్ ఏర్పడుతోంది. ఈ మేరకు ఆమెకు తాజాగా లక్ష మంది ఫాలోవర్లు వచ్చారు. ఇదే విషయమై ఆమె చెబుతూ.. నా పొలంలోనూ లక్ష మొలకలొచ్చాయ్ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల అవుతోంది.