దేవి నాగవల్లి పై సెటైర్ వేసిన గెటప్ శ్రీను.. సెటైరికల్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్..?

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్టిస్టులు, కమెడియన్లు వెండితెరపై అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో గెటప్ శీను కూడా ఒకరు. జబర్దస్త్ గెటప్ శ్రీను తనదైన శైలిలో పంచులు వేస్తూ నవ్వించడమే కాకుండా తన గెటప్ ల తోనే సగం నవ్విస్తూ ఉంటాడు. ఇక తాజాగా ప్రముఖ న్యూస్ రీడర్ దేవి నాగవల్లిని కూడా ఎవరూ ఊహించని విధంగా ఇమేటెట్ చేస్తూ ఒక కామెడీ ప్రోగ్రాం చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇకపోతే ఇటీవలే కొద్ది రోజుల క్రితం యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ని గెట్ అవుట్ మై స్టూడియో అంటూ అవమానించిన విషయం తెలిసింది. ఈ విషయంపై నెటిజన్స్ యాంకర్ దేవి నాగవల్లి పై మండిపడుతూ ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే దేవి నాగవల్లి ప్రవర్తించిన తీరుపై కూడా సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోలింగ్స్ అయితే వచ్చాయి. ఇక ఆ విషయాన్ని అందరూ మరిచిపోతున్న తరుణంలో ఊహించని విధంగా గెటప్ శ్రీను ఆమెను ఇమిటేట్ చేస్తూ ఆ ట్రోలింగ్స్ మరింత బూస్ట్ తెచ్చినట్లు అయింది.

ఏమాత్రం సందేహం లేకుండా దాదాపు అదే తరహాలో ఆమెను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాడు.న్యూసెన్స్ న్యూస్ అంటూ చెప్పడమే కాకుండా ఆ ప్రోగ్రాం లో నే ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఇంగ్లీష్ పదం బూతు అర్థం వచ్చేలా అటుఇటుగా మాట్లాడడం కూడా హైలెట్ గా నిలిచింది. ఇక గెటప్ శ్రీను అయితే తన పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని మరొక నటుడు సత్యపై కూడా విసిరి కొట్టడం కామెడీగానే అనిపించింది. మొత్తానికి వీరు చేసిన ఒక ప్రమోషనల్ స్కిట్ అయితే బాగానే క్లిక్ అయింది. ఇక ఆ వీడియోని చూసిన నెటిజన్స్ దేవి నాగవల్లి కి సెటైరికల్ గానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.