లేటెస్ట్ : వైల్డ్ క్లిప్ తో “దేవర” గ్లింప్స్ రిలీజ్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్ 

టాలీవుడ్ సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రం 30వ సినిమాని అయితే దర్శకుడు కొరటాల సి=శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే “దేవర”. మరి పాన్ ఇండియా లెవెల్లో భారీ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కూడా రీసెంట్ ట్రెండ్ రెండు భాగాలుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ కి వస్తుండగా ఈ కొత్త సంవత్సరం కానుకగా మాసివ్ అప్డేట్ సినిమా గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. కాగా ఈ వీడియోను ఈ జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపిన చిత్ర యూనిట్ ఇప్పుడు దాని తాలూకా రిలీజ్ సమయాన్ని కూడా లాక్ చేసేసారు.

మరి ఈ అప్డేట్ తో జనవరి 8న ఈ సాలిడ్ గ్లింప్స్ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనిపై ఎన్టీఆర్ పై ఓ స్టన్నింగ్ క్లిప్ ని కూడా చూపించారు. ఎన్టీఆర్ రక్తంతో తడిసిన తన ఆయుధంని సముద్రంలో కడుగుతున్నాడు.

అక్కడ ఆ సముద్రం కూడా నెత్తురుతో ఎర్రగా కనిపిస్తుంది. ఇక దీని బట్టి ఈ సినిమాలో ఏక్షన్ ఎంత వైల్డ్ గా ఉంటుందో ఊహించవచ్చు. ఈ క్లిప్ చూసి మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజీగా మారిపోతున్నారు. మరి ఈ భారీ సినిమా గ్లింప్స్ కోసం ఇపుడు అంతా వెయిట్ చేస్తున్నారు.