ఘోరంగా బెడిసి కొట్టింది.. అట్టర్ ఫ్లాప్ అయిన శ్రీముఖి-ప్రదీప్ ప్లాన్!!

Dasara 2020 Sreemukhi Pradeep Event In Zee Telugu Is disaster

దసరా పండుగ రోజున బుల్లితెరపై ఎంత హంగామా జరిగిందో అందరికీ తెలిసిందే. ప్రతీ చానెల్ తమ ప్రత్యేకతను చాటేలా స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేశారు. ముందు అనుకున్నట్టే ఏ ఒక్కరూ కూడా తమ తమ టైమింగ్స్‌లో పోటీ పడొద్దని ముందే డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ఈటీవీ షో మార్నింగ్ వస్తే.. స్టార్ మా ప్రోగ్రాం మధ్యాహ్నం వచ్చింది. ఇక సాయంత్రం సమయంలో మాత్రం జీ తెలుగు వ్యూహం ఫలించలేదు.

Dasara 2020 Sreemukhi Pradeep Event In Zee Telugu Is disaster
Dasara 2020 Sreemukhi Pradeep Event In Zee Telugu Is disaster

ఈ టీవీలో అక్కా ఎవరే అతగాడు అంటూ సంగీత శేఖర్ మాస్టర్ వంటి వారు సందడిచేశారు. టీఆర్పీలో దాదాపు అదే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. మరీ పేలవంగా ఏమీ లేకపోయినా పర్వాలేదన్నట్టుగా టీఆర్పీ(7.98)ని సొంతం చేసుకుంది. ఇక స్టార్ మాలో వంటలక్క, గంగవ్వను తీసుకొచ్చి బాగానే హైప్ పెంచారు. అన్ని షోలో కంటే జాతరో జాతర షోకి 11.34 రేటింగ్ వచ్చి బాగా క్లిక్ అయింది. వంటలక్క ప్రభావం మాత్రం గట్టిగానే పడినట్టుంది. అందుకే ఈ స్థాయిలో క్లిక్ అయింది.

ఎటొచ్చి జీ తెలుగులో ప్రదీప్ శ్రీముఖిలతో చేసిన ఈవెంట్ దారుణంగా బెడిసికొట్టింది. చెప్పుకోవడానికి వీలు కాని టీఆర్పీని సొంతం చేసుకుంది. అది ఇలా డిజాస్టర్ కావడానికి బిగ్ బాస్ సమంత కారణం. సమంత హోస్ట్ చేయడం, సడెన్‌గా టైం చేంజ్ చేసి సాయంత్రం ఆరుగంటల నుంచి ఎపిసోడ్‌ను ప్రసారం చేస్తామని చెప్పడంతో ప్రదీప్ శ్రీముఖి షోకు గట్టి దెబ్బ తగిలింది. ఈ మూడింటిలో శ్రీముఖి ప్రదీప్ షోకు అత్యంత టీఆర్పీ(3.5) రేంటింగ్స్ వచ్చాయి.