సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన దర్బార్ గురువారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా సినిమా రిలీజ్ అయి 24 గంటలు మాత్రమే అవుతోంది. అయితే ఈ సినిమా హెచ్ డి ప్రింట్ అప్పుడే ఇంటర్నెట్ హల్చల్ చేస్తోంది. తమిళ్ రాకరస్ సైట్ లో పుల్ మూవీ హెచ్ డీ ప్రింట్ డౌన్ లోడ్ తో సహా అందుబాటులో ఉండటం యూనిట్ సహా సినీ ప్రియుల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇంత తొందరగా హెచ్ ప్రింట్ ఎలా దిగిపోయిందంటూ పరిశ్రమా సహా అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటికే దర్బార్ ని చాలా మంది డౌన్ లోడ్ చేసినట్లు సమాచారం.
హెచ్ డీ ప్రింట్ కావడంతో! సినిమా చూడాలని ఆత్రంగా ఉన్నవాళ్లు…టికెట్లు దొరకని అభిమాను తమిళ్ రాకర్స్ నుంచి తమ ఫోన్ లోకి డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ వార్త మాత్రం కోలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలో హటా్ టాపిక్. రజనీ సినిమాలు ఇలా పైరసనీ కావడం కొత్తేం కాదు. గతంలో చాలా సినిమాలు జరిగాయి. 2.ఓ సినిమా కైతే ఏకంగా తమిళ రాకర్స్ నుంచి హెచక్చరికలే వెళ్లినట్లు అప్పట్లో సంచలనమైంది.
సినిమా రిలీజ్ అయితన తొలి షో తర్వాత సినిమా మొత్తం తమ వెబ్ సైట్ లో ఉంటుందని హెచ్చరించడం విశేషం. అంతకుముందు కబాలి..అటుసై పేట, లింగ చిత్రాలు కూడా పైరసీ జరిగింది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఏ హీరో టార్గెట్ కాలేదుగానీ…రజిని సినిమాలు మాత్రం పైరసీ అవ్వడం మరోసారి అంతటా చర్చకు దారితీసింది. వీటన్నంటిని తమిళ రాకర్స్ సైట్ లోనే ఉండచం విశేషం. తాజాగా మరోసారి సూపర్ స్టార్ పై తమిళ్ రాకర్స్ పంజా విసరడంతో సైబర్ క్రైమ్ రంగంలోకి దిగింది.