డిజాస్టర్ “కస్టడీ”..డే 2కి తేలిపోయిన వసూళ్లు.!

అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “కస్టడీ”. గత ఏప్రిల్ లోనే వచ్చిన అఖిల్ అక్కినేని భారీ బడ్జెట్ చిత్రం “ఏజెంట్” అల్ట్రా డిజాస్టర్ కాగా ఇప్పుడు వచ్చిన కస్టడీ పైనే అంతా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాకి వచ్చిన మిక్సిడ్ టాక్ సినిమా ఫలితాన్ని అయితే చంపేసింది.

దీనితో చాలా తక్కువ ఓపెనింగ్స్ నే మొదటి రోజు అందుకున్న ఈ సినిమా రెండో రోజుకి అయితే తేలిపోయిందట. మొదటి రోజుకే వరల్డ్ వైడ్ గా కేవలం 2 కోట్ల లోపే షేర్ అందుకున్న ఈ చిత్రం శనివారం హాలిడే లో ఏమన్నా పుంజుకుంటుందా అనుకుంటే రివర్స్ అయ్యిపోయింది. రెండో రోజు వరల్డ్ వైడ్ గా అయితే కోటిన్నర కూడా షేర్ రాలేదట.

దీనితో ఈ సినిమా కూడా మరో డిజాస్టర్ గా నిలిచిపోవడం ఖాయం అని చెప్పక తప్పదు. కాగా ఈ సినిమా అయితే రెండు రోజుల్లో మొత్తం 3.6 కోట్ల లోపే షేర్ ని అందుకుంది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఫుల్ రన్ లో అయితే ఈ సినిమా 5 కోట్లు మేర వచ్చి ఆగిపోవచ్చని చెప్పక తప్పదు.

అయితే ఇక తెలుగు తమిళ్ రెండు భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా తమిళ్ వసూళ్లు అయితే చెప్పక్కర్లేదు. అక్కడ పరిస్థితి మరీ దారుణం అని తెలుస్తుంది. తమిళ దర్శకుడు అక్కడ నటీనటులు కూడా ఉన్నా కూడా జీరో షేర్ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే అక్కనేని హీరోల బ్యాడ్ టైం ఇంకా కొనసాగుతూనే ఉంది.