“కస్టడీ” లాస్ట్ మినిట్ ట్విస్ట్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “కస్టడీ”. వరుసగా మూడు భారీ ప్లాప్ లు చూసిన అభిమానులు ఈసారి నాగ చైతన్య కస్టడీ తో అయినా హిట్ అందుకోవాలని వారు ఆశిస్తున్నారు. మరి రేపు ఈ చిత్రం తెలుగు సహా తమిళ్లో కూడా ఒకేసారి రిలీజ్ కాబోతుండగా ఈ చిత్రానికి అంతా సెట్ చేసి మేకర్స్ కాన్ఫిడెంట్ గా రిలీజ్ రిజల్ట్ కోసం చూస్తున్నారు.

అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అనగా ఈరోజు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఈ సినిమా విషయంలో చోటు చేసుకుంది. ఈ చిత్రం అయితే దర్శకుడు విక్రమ్ ప్రభు తన సొంత కథ కాదు అని ఆల్రెడీ మలయాళ భాషలో ఉన్నటువంటి చిత్రం “నయట్టు” చిత్రానికి ప్రేరణగా చేసింది అని కోలీవుడ్ వర్గాలే చెప్తున్నాయి.

అయితే దీనిపై డైరెక్ట్ గా దర్శకుడే కలుగజేసుకొని సమాధానం ఇచ్చారు. ఒక్కసారిగా నవ్వేసి మీరు చెప్తుంది నిజం కాదు రేపు థియేటర్స్ లో నీతో పాటు అందరికీ కూడా సమాధానం దొరుకుతుంది వేచి చూడండి అంటూ సమాధానం ఇచ్చారు. దీనితో కస్టడీ పై వచ్చిన రూమర్స్ పై అయితే తాను క్లారిటీ ఇచ్చేసాడు.

దీనితో తాను చెప్పినట్టే రేపు అందరికీ క్లారిటీ రానుంది అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా కోలీవుడ్ స్టార్ నటుడు అరవింద స్వామి విలన్ గా నటించారు. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.