ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీ అక్కినేని వారై హీరోస్ పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రం గానే ఉంది. గత రెండేళ్లలో అయితే నాగ చైతన్య “లవ్ స్టోరీ”, “బంగార్రాజు” మరోపక్క అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బాచ్ లర్ లతో మంచి హిట్స్ అందుకోగా..
మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు అనుకునే లోపే నాగ్ సహా ఈ ఇద్దరు యంగ్ స్టార్స్ కూడా ఘోస్ట్, థాంక్ యూ, లేటెస్ట్ ఏజెంట్ లతో భారీ ప్లాప్ లు అందుకున్నారు. వీటిలో నాగ్ ఘోస్ట్ కొంచెం పర్వాలేదు. దసరా సీజన్లో లో జరిగిన బిజినెస్ కి సగానికి పైగా అయినా రాబట్టింది. కానీ ఏజెంట్, థాంక్ యు లు అయితే మొదటి రోజే తేలిపోయి ఊహించని నష్టాలు మిగిల్చాయి.
ఇక దీనితో ఇప్పుడు అంతా నాగ చైతన్య నటించిన “కస్టడీ” పైనే అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని తమిళ హిట్ దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు, తమిళ్ లో ఒకేసారి తెరకెక్కించగా ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద టార్గెట్ తోనే వస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాకి గాను సుమారు 22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. అంటే 50 కోట్లకుపైగా గ్రాస్ ని రాబడితే తప్ప ఈ చిత్రం హిట్ లిస్ట్ లో పడనట్టే అని చెప్పుకోవాలి. మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి అయితే హీరోయిన్ గా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.