సింగర్ సునీత రెండవ పెళ్ళి పై విమర్శలు … కంట తడి పెట్టుకున్న సింగర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లకి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు సింగర్స్ కి కూడా ఉంది. ఒక సినిమాలో హీరో హీరోయిన్లు ఎంత అవసరమో ఆ సినిమాలో తమ పాటలతో ప్రేక్షకులని ఆకట్టుకునే సింగర్స్ కూడా అంతే అవసరం. టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప సింగర్ గా గుర్తింపు పొందిన సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అద్భుతమైన స్వరంతో ఎన్నో వందలు పాటలు పాడే అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న సునీత ఇప్పటికీ తన పాటలతో ప్రేక్షకుల మనసుని దోచుకుంటుంది.

అయితే ఇటీవల తన పిల్లల ప్రోత్సాహంతో సునీత రామ్ వీరపనేనీ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది. అప్పటివరకు ఆమెకు అభిమానులుగా ఉన్న ఎంతోమంది తన రెండవ పెళ్లి విషయంలో మాత్రం ఆమెను వ్యతిరేకించారు. ఈ వయసులో రెండవ పెళ్లి అవసరమా? అంటూ ట్రోల్స్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే సునీత వీటన్నింటినీ పక్కనపెట్టి రామ్ వీరపనేనితో తన జీవితం మళ్లీ మొదలు పెట్టింది.తన పై వస్తున్న విమర్శల గురించి పట్టించుకోకుండా సునీత తన భర్త, పిల్లలతో కలిసి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.

అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి వస్తున్న విమర్శలపై స్పందించింది. ఈ క్రమంలో సునీత మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ… ఇండస్ట్రీలో చిత్ర గారి తర్వాత అత్యధిక సంఖ్యలో 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి అందరి ఎంటర్టైన్మెంట్ కి కారణం అయ్యానని అందరూ నన్ను పొగుడుతూ ఉంటారు. సింగర్ గా కూడా నన్ను ఎంతోమంది అభిమానిస్తున్నారు. అయితే ఇన్ని మంచి విషయాలు నాలో ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం మీద ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారు. రెండవ పెళ్లి పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఒక మనిషిని మాట అనే ముందు అది సరైనదా? కాదా? అని ఒక నిమిషం ఆలోచించాలి అదే సంస్కారవంతుల లక్షణం… అంటూ ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకుంది.