“గేమ్ ఛేంజర్” కి ఊహించని భారీ క్లైమాక్స్.!

సెన్సేషనల్ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ నుంచి అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కెరీర్ లో కూడా 15వ సినిమాగా చేస్తున్న మాసివ్ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్”. పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ బిగ్గెస్ట్ షెడ్యూల్ అండ్ క్లైమాక్స్ ని రీసెంట్ గానే శంకర్ స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

కాగా శంకర్ సినిమాల్లో క్లైమాక్స్ లు ఏ లెవెల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ ని కూడా ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ని శంకర్ నార్మల్ ఫైట్ లాంటివి కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్ గా గన్స్, బాంబులతో నింపేసారట.

మరి ఈ భారీ సీక్వెన్స్ ని అయితే కేజీఎఫ్, విక్రమ్ ఫైట్ మాస్టర్ లు అన్బరివ్ లు కొరియోగ్రఫీ చేస్తున్నారట. మరి శంకర్ ఈ సీక్వెన్స్ ని పర్టిక్యులర్ గా చాలా స్పెషల్ గా డిజైన్ చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాగా ఈ భారీ బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే అంకేముంది ఇతర స్టార్స్ అయితే నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు తమ బ్యానర్ లో అయితే 50 వ సినిమాగా భారీ బడ్జెట్ కేటాయించి నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు.