క్రేజీ టాక్ : “పుష్ప 2” లో సేతుపతి రోల్ పై ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న న్యూస్.!

పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు పెట్టుకొని రాబోతున్న సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల నుంచి వస్తున్న సినిమా “పుష్ప పార్ట్ 2” కోసం అందరికీ తెలిసిందే. చాలా మంది నమ్మకపోవచ్చు కానీ ఈ సినిమాపై బాహుబలి 2, కేజీఎఫ్ 2 తరహాలో భారీ హైప్ ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది.

ఇంకా భారీ రీచ్ తో పార్ట్ 1 పుష్ప ది రైజ్ ఎఫెక్ట్ గట్టిగా పడింది. దీనితో ఈ భారీ సినిమా ఎపుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు లేటెస్ట్ విక్రమ్ ఫేమ్ విజయ్ సేతుపతి కూడా ఉన్నాడని టాక్ బయటకి రాగా..

ఇప్పుడు ఇది నిజమే అంటూ సినీ వర్గాల్లో అటు తమిళ సినీ వర్గాల నుంచి కూడా క్రేజీ టాక్ బయటకి వచ్చింది. గతంలో విజయ్ సేతుపతిని గోవిందప్ప పాత్ర కోసం అనుకోగా అప్పుడు జరగలేదు. కానీ ఈసారి రెండో సినిమాలో మాత్రం సుకుమార్ అంతకు మించిన పాత్రని రాసినట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా విజయ్ సేతుపతి ఈసారి కూడా పోలీస్ గానే కనిపిస్తాడని కూడా అంటున్నారు. మొత్తానికి అయితే ఈ సాలిడ్ టాక్ బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి దేవి సంగీతం అందిస్తున్నాడు. అలాగే రశ్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.