ఇన్సైడ్ టాక్ : “బ్రో” కి మామూలు ప్లాన్స్ చేయట్లేదట బ్రో.. 

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా ఇప్పుడు పలు ఇతర సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఇది వరకే ఎన్నో చిత్రాల్లో గెస్ట్ రోల్ లో కనిపించిన తాను ఇప్పుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా “బ్రో ది అవతార్” లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమా ఇప్పుడు డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేసేసుకోగా ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తున్నారు అనే అంశం పై క్రేజీ న్యూస్ అయితే తెలుస్తున్నాయి. అవ్వడానికి ఇది రీమేక్ అయినా కూడా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి ట్రెమండస్ మార్పులు చేసి దర్శకుడు సముద్రఖని కి ఇచ్చారట.

దీనితో సినిమా ఒరిజినల్ దర్శకుడు సముద్రఖని కి కూడా అవి నచ్చడంతో పవన్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా అయితే ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడని కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉండగా ఈ గ్యాప్ లో థమన్ కూడా క్రేజీ వర్క్ చేస్తున్నట్టుగా ఇపుడు వైరల్ గా మారింది.

పవన్ సినిమా కోసం అయితే థమన్ ఓ ఇంట్రెస్టింగ్ బ్లాక్ కోసం గుడుంబా శంకర్ లోని ఐటెం నెంబర్ నుంచి ట్యూన్ ని రీమిక్స్ చేస్తున్నాడట. అంతే కాకుండా పవన్ పాత సినిమాల్లో కొన్ని బిట్స్ కూడా మళ్ళీ మేకర్స్ పవన్ చేత రీ క్రియేట్ చేసినట్టుగా కూడా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో అయితే “బ్రో” ని మాత్రం గట్టి ప్లానింగ్స్ తోనే సెటప్ చేస్తున్నారని చెప్పాలి.