NTR30 – తారక్ రోల్ పై క్రేజీ టాపిక్.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో ఓ రేంజ్ హైప్ ఉన్న పలు చిత్రాల్లో ఆల్ మోస్ట్ అన్నీ మన తెలుగు నుంచే సినిమాలు ఉన్నాయి. అలాగే వాటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మాస్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివతో అయితే రెండో సినిమాగా తారక్ చేస్తున్నాడు.

మరి ఈ సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ ఏక్షన్ డ్రామాగా ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో అయితే నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కుతుంది. కాగా ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఓ నెవర్ బిఫోర్ మాస్ రోల్ లో కనిపిస్తాడని ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ సినిమాలో అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి మరో షాకింగ్ బజ్ బయటకి వచ్చింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ అయితే డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. కాగా ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకుగా ఇద్దరి రోల్స్ లో డ్యూయల్ షేడ్స్ లో కనిపించనున్నాడని ఇప్పుడు సినీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారం. మరి ఇదే గాని నిజం ఐతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మామూలు ట్రీట్ లా ఉండదని చెప్పాలి.

ఇంకా ఈ సినిమాలో అయితే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుంది. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మాస్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు భారీ లెవెల్లో భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తూ వచ్చే ఏడాది ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నారు.