ఇండస్ట్రీ టాక్ : చరణ్ – లోకేష్ భారీ ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్.!

Director-Lokesh-Kanagaraj

పాన్ ఇండియా మరియు గ్లోబల్ హీరో గా మారిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ మాత్రం మంచి క్రేజీ గా ఉంటుందని చెప్పాలి. చాలా ట్రెండీ అండ్ స్టైలిష్ సినిమాలు చేసే చరణ్ ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. అలాగే నెక్స్ట్ కూడా దర్శకుడు బుచ్చిబాబు సానా తో ఓ సినిమా తాను చేయనున్నాడు.

అయితే వీరి సినిమాలు ఏమో కానీ శంకర్ తర్వాత చరణ్ ఫ్యాన్స్ మరియు మెగా ఫ్యాన్స్ లు బాగా ఎగ్జైటెడ్ ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగ రాజు తో ప్లాన్ చేస్తున్న సినిమా అనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు కానీ నిజంగా ఉండే ఛాన్స్ గట్టిగా ఉండేలా ఉందని లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల టాక్.

అయితే చరణ్ తో ఆల్రెడీ తన కెరీర్ లో 16వ సినిమాని భారీ సినిమాల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకి దర్శకులు ఒకొక్కరి పేరు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్లాయి. మరి ఇప్పుడు ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లోకేష్ కనగ రాజు తో ఉండే ఛాన్స్ లు అధికంగా ఉన్నాయని అంటున్నారు.

ఎందుకంటే ప్రస్తుతం యూవీ వారు లోకేష్ తో ఓ సినిమా ఓకే చేసుకున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ తోనే అవ్వవచ్చని గట్టి టాక్ వినిపిస్తుంది. దీనితో ఈ అవైటెడ్ ఇంట్రెస్టింగ్ కాంబో ఇప్పుడు సెట్ అయ్యేలానే ఉందనుకోవాలి.