పవన్ – సాయి తేజ్ సినిమా టైటిల్ పై క్రేజీ గాసిప్.!

ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు వరుసగా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ లిస్ట్ లో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ చిత్రం కూడా ఒకటి ఉంది. ఇది తమిళ సినిమా వినోదయ సీతం కి రీమేక్ గా తెరకెక్కిస్తుండగా ప్రముఖ నటుడు సముద్రఖని ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్ ఆల్రెడీ తన పోర్షన్ ని కంప్లీట్ చేసేయగా మిగతా షూట్ కంప్లీట్ చేసుకొని ఈ సినిమా ఈ జులై లో రిలీజ్ కాబోతుంది. ఇక దీనిపై మంచి అంచనాలు అయితే నెలకొనగా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ బయటకి వచ్చింది. ఈ సినిమాకి ఏకంగా మేకర్స్ 9 టైటిల్స్ ని అనుకున్నారట.

అయితే వీటిలో ఫైనల్ లిస్ట్ లో అయితే మూడు టైటిల్స్ ని పెట్టారట. ఇక వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసి మంచి టైం చూసి అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదెప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో అయితే కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో మాటలు స్క్రీన్ ప్లే ని అయితే అందిస్తున్నారు.

అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అయితే ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. ఇక లేటెస్ట్ గానే సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” చిత్రంతో సూపర్ హిట్ అందుకొని నెక్స్ట్ పవన్ తో సినిమా కూడా హిట్ కొడుతున్నామని ధీమా వ్యక్తం చేసాడు.