క్రేజీ – షారుఖ్ భారీ ఏక్షన్ థ్రిల్లర్ కి పాన్ ఇండియా రిలీజ్ డేట్ ఖరారు.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మన సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇప్పుడు మన టైం కాగా ఒకప్పుడు అయితే హిందీ సినిమాలు ఎన్నో మన తెలుగు మార్కెట్ లో భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచి భారీ వసూళ్లను అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

అయితే ఈ సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమాలు కూడా ఉన్నాయి. తన నుంచి అయితే లాస్ట్ టైం “హ్యాపీ న్యూ ఇయర్” చిత్రం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యినట్టు అందరికీ గుర్తు. ఆ సినిమా ప్లాప్ తో పాటు ఇప్పటి వరకు తన నుంచి సరైన హిట్ లేదు. 

అందుకే షారుఖ్ అభిమానులు చాలా ఆకలి మీద ఉన్నారు. అయితే ఇపుడు షారుఖ్ నుంచి అయితే క్రేజీ అనౌన్సమెంట్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో చేస్తున్న భారీ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం “పఠాన్” కూడా ఒకటి. ఈ చిత్రం పై ఇప్పుడు స్వయంగా షారుఖ్ రిలీజ్ డేట్ అప్డేట్ అందించాడు. 

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 23న హిందీ, తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేసారు. దీనితో ఈ భారీ అనౌన్సమెంట్ ట్రెండింగ్ గా పాన్ ఇండియా సినిమాలో నిలిచింది.