Bigg boss 4: హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న వివాదాస్పద సింగర్?

controversial singer to give entry into bigg boss 4 tamil house

బిగ్ బాస్.. భాష ఏదైనా కాన్సెప్ట్ ఒకటే. హిందీ, తమిళం, తెలుగు… అనే భాషాభేదాలు లేకుండా.. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది బిగ్ బాస్ షో.

ప్రస్తుతం మూడు భాషల్లో బిగ్ బాస్ సీజన్ ప్రారంభమయింది. హిందీ, తమిళంలో ఇటీవలే ప్రారంభం కాగా… తెలుగులో ప్రారంభమయి రెండు నెలలు దాటింది.

controversial singer to give entry into bigg boss 4 tamil house
controversial singer to give entry into bigg boss 4 tamil house

ఇక.. తమిళ్ బిగ్ బాస్ షోకు నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు షోకు నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. హిందీకి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నారు.

అయితే.. త్వరలో బిగ్ బాస్ తమిళ్ హౌస్ లోకి వివాదాస్పద సింగర్ సుచిత్ర ఎంట్రీ ఇవ్వబోతోందట. సుచిత్ర అనగానే మనకు గుర్తొచ్చేది సుచిత్ర లీక్స్. అప్పట్లో సుచిలీక్స్ పేరుతో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కోలీవుడ్ ను ఓ ఊపు ఊపింది సుచిలీక్స్.

controversial singer to give entry into bigg boss 4 tamil house
controversial singer to give entry into bigg boss 4 tamil house

కోలీవుడ్ కు చెందిన పలువురు సినీ సెలబ్రిటీల ప్రైవేటు ఫోటోలను లీక్ చేసి సంచలనం సృష్టించింది. తర్వాత ఆ విషయాన్ని కోలీవుడ్ మరిచిపోయింది.

అయితే.. అప్పటి నుంచి సుచిత్ర కూడా కాస్త సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చింది. తాజాగా ఆమె గురించి కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సుచిత్ర బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి.

controversial singer to give entry into bigg boss 4 tamil house
controversial singer to give entry into bigg boss 4 tamil house

ఒకవేళ ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఇక ఎంటర్ టైన్ మెంట్ డబుల్ అవ్వడమే అంటూ.. బిగ్ బాస్ అభిమానులు అంటున్నారు. ఇప్పటికే మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అర్చన చందోకే రాగా.. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుచిత్ర అడుగుపెట్టనుంది.

అనుకున్నంత మేర బిగ్ బాస్ రేటింగ్స్ రాకపోవడంతో.. సుచిత్రను తీసుకొచ్చి రేటింగ్స్ పెంచుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. చూద్దాం మరి.. సుచిత్ర వస్తే అయినా బిగ్ బాస్ లేస్తుందో లేదో?