బాక్సాఫీస్ : సెన్సేషనల్ క్లబ్ లో చేరిన కాంట్రవర్సీ చిత్రం.!

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర పెద్ద ఎత్తున కాంట్రావర్సీ రేపుతూ రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో దర్శకుడు సుదీప్తో సేన్ తెరక్కెక్కించిన రియల్ ఇన్సిడెంట్స్ చిత్రం “ది కేరళ స్టోరీ” కూడా ఒకటి. మరి అదా శర్మ మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రం కేరళ లోని నిజంగా జరిగిన కొన్ని షాకింగ్ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా ట్రైలర్ తోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇక ఈ చిత్రం అయితే ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ ని నమోదు చేయగా మొదటి రోజుతో పోలిస్తే ఇక ఉండి ఉండి భారీ స్థాయిలో అయితే మార్జిన్ తో రికార్డు స్థాయి వసూళ్లు ఈ చిత్రం రాబట్టడం స్టార్ట్ చేసింది. మరి ఈ మే మొదటి వారంలో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరింది.

డే 1 కి జస్ట్ 8 కోట్లతో బాక్సాఫీస్ ఓపెన్ చేసిన ఈ సినిమా ఈ సోమవారం 5 కోట్ల గ్రాస్ తో అయితే సెన్సేషనల్ మైల్ స్టోన్ 200 కోట్లు టచ్ చేసి ఇప్పటివరకు ఈ చిత్రం 203.47 కోట్ల గ్రాస్ కి చేరుకుంది. దీనితో అయితే ఇప్పుడప్పుడే ఈ సినిమా హవా ఆగేలా లేదని చెప్పాలి.

మరి గతంలో వచ్చిన మరో కాంట్రవర్సియల్ చిత్రం “ది కాశ్మిర్ ఫైల్స్” చిత్రం కూడా ఇదే తరహాలో వచ్చి సెన్సేషన్ ని సృష్టించింది. మరి కేరళ స్టోరీ దానికి మించి వసూళ్లు కొల్లగొడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.