“కేరళ స్టోరీ” పై రివ్యూ చెప్పిన పవర్ స్టార్ దర్శకుడు.!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర పెద్ద ఎత్తున కాంట్రవర్సీ తో చిన్న సినిమాగానే వచ్చిన చిత్రం “కేరళ స్టోరీ”. అదా శర్మ మెయిన్ లీడ్ లో నటించిన ఈ నిజ జీవిత చిత్రం ఇది కాగా ఈ సినిమా ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు రాబడుతూ దుమ్ము లేపుతుంది.

మొదటి రోజు కేవలం 8 కోట్లు ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం నెక్స్ట్ అయితే ఏ రోజు కూడా 10 కోట్లకి తక్కువ వసూళ్లు రాబట్టలేదు. దీనితో ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అది కూడా ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ కూడా కాకుండా రాబట్టడం విశేషం.

దీనితో అన్ని భాషల్లో కూడా గట్టిగా వినిపిస్తున్న ఈ చిత్రం పై లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ దర్శకుడు లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రివ్యూ చేసాడు. ఈ చిత్రం చాలా ఇంటెన్స్ గా పచ్చిగా ఉందని ఐఎస్ ఐఎస్ ఎపిసోడ్స్ ని చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు అని..

అదా శర్మ అయితే తన పాత్రలో అలా ఒదిగిపోయింది మొత్తం టీం కి పెద్ద కంగ్రాట్స్” అంటూ హరీష్ శంకర్ ఈ సినిమా చూసాక తన స్పందనను రివ్యూ చేసాడు. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఈ వారం నుంచి తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రం తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. 
https://twitter.com/harish2you/status/1657261054185938945