కన్ఫర్మ్..ఇది రవితేజ “కేజీఎఫ్”..!

ఇప్పుడు టాలీవుడ్ సినిమా స్కేల్ ఎంత లెవెల్లో మారిపోయిందో చెప్పక్కర్లేదు సినిమా కంటెంట్ సరైంది పడితే ఆ సినిమా వేరే లెవెల్లో అయితే హిట్ అవుతుంది. అయితే పాన్ ఇండియా మార్కెట్ లో ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసిన సినిమాల్లో కన్నడ నుంచి వచ్చిన ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా “కేజీఎఫ్” కూడా ఒకటి.

ఈ సినిమా వచ్చాక చాలా ఇతర సినిమాల విషయంలో దీని రిఫరెన్స్ తో పోల్చడం స్టార్ట్ చేశారు. అలా ఓ హీరో భారీ సినిమా అందులోని ఒక గ్యాంగ్ స్టర్ తరహాలో మెయిన్ గా హీరోని బాగా ఎలివేట్ చేస్తే అది ఆ హీరో కేజీఎఫ్ అని అంటున్నారు. మరి అలా ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ వంతు వచ్చింది అని చెప్పాలి.

కాగా ఇప్పుడు రవితేజ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చిత్రమే “టైగర్ నాగేశ్వరరావు”. పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు ఉండగా ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలో లేటెస్ట్ గా రెండో పాటపై రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అందులో రవితేజ మాములు మాస్ ప్రెజెన్స్ తో కనిపించడం లేదు.

దీనితో ఇది ఖచ్చితంగా రవితేజ కేజీఎఫ్ అనే చెప్పి తీరాలి అనేలా ఉంది. పోస్టర్ డిజైన్ రవితేజ నడక మాములుగా లేవు. దీనితో ఈ భారీ చిత్రం కేజీఎఫ్ లెవెల్లో హిట్ అవుతుందో లేదో అనేది చూడాలి. ఇంకా ఈ సినిమాకి దర్శకుడు వంశీ వర్క్ చేస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నపూర్ సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ దసరా కానుకగా అయితే సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.
https://x.com/AAArtsOfficial/status/1703719642408362216?s=20